ముగ్గురు శక్తి స్వరూపిణిల్లో ఒకరైన విష్ణుపత్ని లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత. లక్ష్మీని పూజించేవాళ్లు అపార ధనరాశులతో తులతూగడమే కాదు ఆనందంగానూ ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజును ధనదేవతను ఆరాధిస్తే సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం ఈ నిబంధనలను పాటించి జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందండి.

వారాల్లో ఏడు రోజులున్నా.. శుక్రవారానికి ప్రత్యేకత వుంది. శుక్రవారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. శుక్రవారాల్లో మహిళలు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించడం చేస్తుంటారు. అలాగే శుక్రవారం పూజ ఆయురారోగ్యాలు, సిరిసంపదలను ప్రసాదిస్తుంది. సౌభాగ్యాన్నిస్తుంది. ఈతిబాధలుండవు. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. శుక్రవారం ఉదయం పూట లక్ష్మీదేవిని పూజించడం ఉత్తమం.


శ్రీమహావిష్ణువు పాదాల చెంత కూర్చుని ఉండే లక్ష్మీదేవి ఫోటోను పూజిస్తే తక్షణమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.


ఆశోక పత్రాలను తోరణంగా కుట్టి ఇంటిలోనికి ప్రవేశించే గుమ్మంకు వేలాడదీస్తే దుష్ట శక్తులు ప్రభావం, ప్రతికూలతలు తొలగిపోతాయి.


తామర పుష్పంలో కూర్చుని ఉండే లక్ష్మీదేవి చిత్రాన్ని ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి లాకర్లో భద్రపరిస్తే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించి సమస్యలు ఉండవు.

చీపురు, గులాబీ సువాసన కలిగిన అగరువత్తులు మహాలక్ష్మీ ఆలయం సమీపంలో దానం చేయండి.

అరటి ఆకుపై బియ్యాన్ని పరచి రాగి చెంబుతో కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశానికి ముందు పండ్లు, నట్స్‌ను సిద్ధం చేసుకోవాలి. కలశానికి నూలు కట్టి.. మామిడి ఆకులు పెట్టి.. ఆపై కొబ్బరికాయను వుంచాలి. కలశంలో శుభ్రమైన నీటిని చేర్చి అందులో పచ్చకర్పూరాన్ని వేయాలి. కొబ్బరికాయపై పుష్పాలను వుంచాలి.

తర్వాత ఆ కలశాన్ని లక్ష్మీదేవిగా భావించి.. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. ఇలా వీలైనంత వరకు మూడు వారాల పాటు చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కలదు.