localnewsvibe

విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్లు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు, సిస్టమ్‌ అనలిస్టులు, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌ పోస్టులను జిల్లాల వారీగా 704 కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.

ఈ పోస్టుల భర్తీకి 2019 డిసెంబర్‌లోనే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. ఇతర కారణాలతో పోస్టుల భర్తీని నిలిపివేశారు. తాజాగా వాటిని జిల్లా కేంద్రంగా కలెక్టర్‌ నేతృత్వంలో నియామకాలు జరుపాలని ఉత్తర్వుల్లో ఆ శాఖ పేర్కొన్నది.

ఈ రోజు డీఈవో ఆఫీసు లో జనరల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేసి శనివారం క్యాటగిరీల వారీగా ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు సిద్ధం చేసి జూలై 3న విడుదల చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 3లోగా స్వీకరించి, జూలై 5న పరిశీలిస్తారు. జూలై 7న చివరి జాబితాను ఎంపికచేసి అభ్యర్థుల సర్టిఫికెట్లను 10న పరిశీలించి, అప్పటికప్పుడే నియామకం చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులు అభ్యర్థులు తదుపరి 3 రోజుల్లోగా విధులకు హాజరుకావాలి. ఈ కాంట్రాక్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 24 వరకు వర్తిస్తుంది.