localnewsvibe

🔱 మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ‘ అహంకారం’ మరి యొకటి ‘ మమకారం’.

🔱 అహంకారం ‘ నేను, నేను’ అంటే మమకారం ‘ నాది, నాది’ అంటూ ఉంటుంది.

🔱 ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు ‘ ఇది నాది ‘ అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు ‘ ఇది నేను చేసినాను’ అనే భావన అహంకారం వలన కలుగుతుంది.

🔱 దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన.
జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు.

🔱 ఆ ప్రదేశం ఎంతో పుణ్య క్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు.

🔱 ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు. జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రఘర్భాలు పలికినాడు.

🔱 అదివింటూ జగద్గురువుల వారు మోనంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు. గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు.

🔱 జగద్గురువులు “మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా”..?
అధికారి అవును చూస్తున్నాను. 

జగద్గురువులు : దీని ఎత్తు ఎంత..?

అధికారి         : చాలా ఎక్కువ.

🔱 జగద్గురువులు : దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?

🔱అధికారి  చాలా తక్కువ స్థాయిలో
జగద్గురువులు :ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా. ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి.

🔱 మనం ఎంతటి అజ్ఞానమైన హీన స్థితి లో వున్నామో తెలియపరచేలా చేస్తుంది. ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతొ పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము.

అందువల్ల “నేను దీన్ని చేసాను” వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం…