localnewsvibe

♦️ 1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.

♦️ 2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.

♦️ 3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.

♦️ 4. తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.

♦️ 5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.

♦️ 6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.

♦️ 7. సూర్య గ్రహణానికి ముందు ”12 ” గంటల కాలము, చంద్ర గ్రహణానికి ”9” గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.

♦️ 8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి బుధునకు, ఇనుము శని కి ఇష్టము.

♦️ 9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.

♦️ 10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.

♦️ 11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.

♦️ 12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.

♦️ 13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.

♦️ 14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.

♦️ 15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.

♦️ 16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.

♦️ 17. వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.

♦️ 18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.

♦️ 19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.

♦️ 20. కొబ్బరి – మామిడి – అరటి – పనస ఉదయం పూట తినరాదు.

♦️ 21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.

లోకా సమస్తా సుఖినోభవన్తు!