localnewsvibe

గరుత్మంతుడు వివాహితుడే. అతనికి రుద్రా, సుకీర్తి అను పేర్లు గల ఇద్దరు భార్యలున్నారు.

స్వామి భక్తులందరికీ వివాహము, భార్యలు, సంతానము, సంసారము, భోగాలు అన్నీ ఉంటాయి.

స్వామి తన భక్తులకు తనకున్న భోగాలవంటివి ఇస్తాడు. అది కూడా పరీక్షించటానికే.

భోగాలలో మునిగి నన్ను మరిచిపోతాడా లేక నన్ను ధ్యానించి భోగాలను మరిచిపోతాడా?

భోగానుభవము కూడా నా కైంకర్యంగా భావిస్తాడా అని పరీక్షించటానికి అన్ని భోగాలను ప్రసాదిస్తాడు.

ఆయన ఇచ్చిన భోగాలతో ఆయననే ఆరాధించటం నిజమైన భక్తుని కర్తవ్యం. ఆ విషయం మనకు గరుత్మంతుని చరిత్రే చెపుతుంది.

ఋషుల అనుగ్రహం ద్వారా గరుత్మంతుడు అమిత బలపరాక్రమాలతో పుట్టాడు.

తన తల్లి దాస్య విముక్తికై స్వర్గం మీద దాడి చేసి ఇంద్రుని ఓడించినంత పని చేశాడు.

విష్ణుమూర్తి సంతోషించి వచ్చి వరం కోరుకొమ్మంటే బలగర్వంతో నీవే కోరుకో, నేనే వరమిస్తానన్నాడు.

స్వామి చిరునవ్వుతో నాకు వాహనంగా ఉండు అని వరం కోరాడు. ఇక చేసేది లేక ఆమోదించాడు.

అతనికి తాను బలం ప్రసాదించాడు ఆ బలంతో తన సేవే చేయాలి, కాని గర్వించటానికి కాదు అని సూక్ష్మంగా ఉపదేశించాడు.

ఇది ఒక గరుత్మంతునికే కాదు మన అందరికీ వర్తిస్తుంది..