పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ వాడాలని సర్కార్ భావిస్తోంది.

గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ 90GSMకు పెంచారు.

దీనికి తోడు ఒక పుస్తకాన్ని ఇంగ్లిష్, తెలుగులో ముద్రించడంతో.. బరువు, ధరలు కూడా పెరిగాయి. తాజాగా పుస్తకాల బరువు తగ్గించాలని ప్రధానోపాధ్యా యుల సంఘం కోరింది. దీనిపై త్వరలో ప్రకటన రానుంది.