ఉత్తరప్రదేశ్ కు చెందిన కూరగాయల వ్యాపారి అనిల్ సాహూ ఐదేళ్లు కష్టపడి ఓ అరుదైన గడియారం సృష్టించారు.

ఇది 9 దేశాల సమయం తెలియజేస్తుంది. ఆయన దీన్ని అయోధ్య రాముడికి కానుకగా సమర్పించారు. రామ మందిర కాంప్లెక్స్ లో ఈ గడియారం పెట్టాలని కోరారు.

కాగా, జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా వేడుక జరగనుంది.