రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో బైక్-టిప్పర్ ఢీ కొన్నాయి.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తండ్రికుమారుడు మృతిచెందారు. మృతులు కుత్బుల్లాపూర్‌కు చెందిన కుమార్ (40), ప్రదీప్ (8)గా గుర్తించారు.
ఈ ఘటనలో బైకు పూర్తిగా దగ్ధమవ్వగా.. టిప్పర్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.