అర్హులైన వారికి ఆరుగ్యారంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన సభలను నిర్వహిస్తోంది.

గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారంతో ముగియబోతోంది.

గత నెల 28న ప్రారంభమైన ఈ సభలు గత నెల 31, ఈనెల 1 వతేదీ మినహా మిగిలిన రోజుల్లో ఖమ్మం జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా, ఆరో రోజైన గురువారం జిల్లాలో 61,691దరఖాస్తులు అందాయి.