అమెరికా లాస్ వెగాస్ రాష్ట్రంలోని ఓ కోర్టులో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
క్లార్క్ కౌంటీ జిల్లా కోర్టు జడ్జి మేరీ హోల్టస్ (60)పై ఓ నేరస్తుడు దాడి చేశాడు. రెడ్డెన్(30) అనే వ్యక్తి తనకు జడ్జి శిక్ష విధించారనే కోపంతో ఆమెపైకి దూకి గాయపరిచాడు.
ఈ క్రమంలో ఓ మార్షల్ కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం జడ్జి పరిస్థితి క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది.