హైదరాబాద్ వాసులకు గుడ్స్యూస్. త్వరలో మౌలాలి-హైటెక్ సిటీ MMTS రైలు పట్టాలెక్కనుంది.

MMTS రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలి-సనత్ నగర్ మధ్య నిర్మిస్తున్న రెండో లైను పనులు పూర్తయ్యాయి.

దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి MMTS రైళ్లు నడిపేందుకు అవకాశం లభించింది. ఫిబ్రవరిలోపే ఈ మార్గంలో MMTS రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.