శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్కోర్టు దేవస్థానం బోర్డు పరిమితి విధించింది.

ఇకపై ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని ప్రకటించింది. ప్రసాదం డబ్బాల కొరత, మకర జ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దీనిపై పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.