పోస్టాఫీసుల ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని RBI ప్రకటించింది.

ఈ నోట్ల మార్పిడి/ డిపాజిట్ చేసేందుకు ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది.

ఆన్లైన్లో లభించే అప్లికేషన్ను నింపి.. పోస్టాఫీసుల ద్వారా తమ 19 ఇష్యూ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపాలని తెలిపింది. కాగా గత ఏడాది మేలో రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించింది.