కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణోత్సవం రేపు వైభవంగా జరగనుంది.

భక్తులు వేలాదిగా తరలిరానుండగా, ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కల్యాణానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.