కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు, కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని సమాచారం.

ఇందుకు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేశారని అధిష్ఠానం పెద్దలు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఏపీలో దెబ్బతిన్న పార్టీని తిరిగి పుంజుకునేలా కృషి చేయాలని ఆమెకు సూచించారు. ఇప్పటికే కార్యాచరణ రూపొందించామని.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని షర్మిలకు దిశానిర్దేశం చేశారట.