రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావం ఉన్న తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.