ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పుష్య
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: షష్ఠి ఉ.10:23 వరకు
తదుపరి సప్తమి
వారం: గురువారం – బృహస్పతివాసరే
నక్షత్రం: చిత్ర 27:50:44 వరకు
తదుపరి స్వాతి
యోగం: ధృతి ఉ.11:58 వరకు
తదుపరి శూల
కరణం: వణిజ ఉ.10:23 వరకు
తదుపరి భధ్ర రా.11:07 వరకు
తదుపరి బవ
వర్జ్యం: ఉ.07:05 – 08:50 వరకు
మరియు రా.తె.06:34 – 08:17 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:35 – 11:21
మరియు ప.03:09 – 03:55
రాహు కాలం: ప.01:55 – 03:20
గుళిక కాలం: ఉ.09:38 – 11:04
యమ గండం: ఉ.06:48 – 08:13
అభిజిత్: 12:07 – 12:51
సూర్యోదయం: 06:48
సూర్యాస్తమయం: 06:11
చంద్రోదయం: రా.11:31
చంద్రాస్తమయం: ఉ.10:42
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
దిశ శూల: దక్షిణం
త్రిస్రోష్టకములు
శ్రీ బ్రహ్మానంద జయన్తీ
దగ్ధయోగము
శ్రీ బాలచంద్ర మహారాజ్
జయన్తీ
పూర్వేద్యుశ్రాద్దము
శ్రీ సత్యకామతీర్థ
పుణ్యతిథి
శ్రీ అచ్యుత్ మహారాజ్
జయన్తీ
వళలాంబే శంఖపాల
సుబ్రహ్మణ్య జాతర
స్వామిమలై శ్రీ మురుగన్
వజ్రకవచ దర్శనం
శ్రీ జువ్వాడి గౌతమరావు
జన్మదినం
నేటి రాశి ఫలాలు
మేషం
అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృషభం
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభప్రదం.
మిధునం
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం
శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో దైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
సింహం
మీకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. విష్ణుసహస్రనామ పారాయణ శుభదాయకం,
కన్య
జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. మీ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాలలో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.
తుల
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
వృశ్చికం
మనోదైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం చదవడం మంచిది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
మకరం
మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈశ్వరధ్యానం శుభప్రదం.
కుంభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
మీనం
మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడం ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మిదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)