ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది. https://fastag .ihmcl.com/ లేదా https://www.netc.org.in / లో కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది.

జనవరి 31లోగా కేవైసీ అప్డేట్ చేయని ఫాస్టాగ్లను ఫిబ్రవరి 1 నుంచి డీయాక్టివేట్ చేస్తామని NHAI గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.