ఢిల్లీ సీఎం కేజీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ టీం మరోసారి వెళ్లింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించగా, ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనను కోరారు.

దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి నిన్న పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. నిన్న నోటీసులివ్వడం సాధ్యం కాకపోవడంతో ఇవాళ మరోసారి వెళ్లినట్లు తెలుస్తోంది.