అవినీతి కేసుల్లో జైలు శిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మరో షాక్ ఇచ్చింది.

ఆయన సతీమణి బుష్త్రా ఖాన్తో వివాహం చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారికి ఏడేళ్ల కారాగార శిక్ష, చెరో రూ.5లక్షల జరిమానా విధించింది. మాజీ భర్త నుంచి విడాకులు పొందాక నిర్దేశిత గడువు పూర్తికాకుండానే బుర్రా ఇమ్రాన్ను వివాహమాడటం ఇందుకు కారణం. కాగా వీరిద్దరికీ ఇటీవల మరో కేసులో 14ఏళ్ల జైలు శిక్ష పడింది.