రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోడ్ షోలు, రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఆమె పాల్గొననున్నారు.

ఇందులో భాగంగా 8 జిల్లాల పరిధిలో 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. సత్యసాయి జిల్లాలోని మడకశిర నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. ప్రత్యేక హోదా కోసం ఆమె ఢిల్లీలో ఇటీవల దీక్ష చేసిన విషయం తెలిసిందే.