పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని ఈ నెల 7న రీరిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు.

‘నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ ఎవరికి తగలాలో వాళ్లకు తగులుతాయి. పవన్ ఆలోచనలను మరింత మందికి చేరవేయాలన్నదే మా దృక్పథం.

ఈ సినిమాకు అమ్ముడయ్యే ప్రతి టికెట్ పై రూ.10 జనసేన పార్టీ నిధి కోసం అందజేస్తాం’ అని తెలిపారు.