రైలు కింద పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ వద్ద చోటుచేసుకుంది.

పోలీసుల కథనం మేరకు… మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన చల్ల విష్ణు (24) బీటెక్ చదువుతున్నాడు. విదేశాల్లో స్థిరపడేందుకు యత్నించగా వీసాలు రిజెక్ట్ అయ్యాయి.

మనస్తాపానికి గురైన విష్ణు శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.