JEE మెయిన్ చివరి విడత పరీక్షల షెడ్యూల్ని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మార్చింది. ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ మధ్య పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.

తొలుత ఏప్రిల్ 1 నుంచి జరుగుతాయని NTA పేర్కొనగా… CBSE పరీక్షల నేపథ్యంలో ప్రారంభ తేదీని మార్చింది. మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

గతంలో ఒకేసారి రెండు విడతలకు అప్లై చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.