వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ల ముందు TS అని ఉండగా, దాన్ని TGగా మార్చనున్నట్లు సమాచారం.

దీనిపై ఈరోజు జరగనున్న మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీల అమలుపై ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.