ప్రజాప్రతినిధులు పదవీకాలంలో ప్రజలకు చేసే సేవలే ముఖ్యం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల పదవీకాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గం సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాగారం సర్పంచ్ బానోత్ రాజా, ఉప సర్పంచ్ తోకల చందు తోపాటు పాలకవర్గం సభ్యులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో తమను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలనీ కొత్వాల అన్నారు.

కొత్వాలను సన్మానించిన నాగారం గ్రామస్థులు
ఇటీవల DCMS చైర్మన్ గా ఎన్నికైన కొత్వాల శ్రీనివాసరావును నాగారం గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఆయనను శాలువా, బొకే లతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ రాజా, ఉప సర్పంచ్ తోకల చందు, సెక్రటరీ దుర్గారావు, మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు, పెద్దమ్మతల్లి దేవాలయం డైరెక్టర్ కాటారపు ఆదినారాయణ, కందుకూరి రాము, దారా చిరంజీవి, కాటారపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.