పాల్వంచ దమ్మపేట సెంటర్ హోటల్ యజమాని నవ్వుల వీరభద్రం (కన్నా) అకాలమరణం విచారకరమని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కన్నా గుండెపోటుతో శనివారం మరణించారు. ఆదివారం దమ్మపేట సెంటర్ లోని అయన భౌతికకాయానికి కొత్వాల పూలమాలవేసి నివాళులర్పించి, సంతాపం తెలిపారు. అయన సోదరుడు చిన్నాకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పేదల సమస్యల పట్ల స్పందించే కన్నా వంటి వ్యక్తి మరణం తీరని లోటు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణరావు, కందుకూరి రాము, దారా చిరంజీవి, గంధం నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.