రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కేంద్ర మార్కెటింగ్ సహకార సొసైటీ (DCMS) కు నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొత్వాల శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ఖమ్మంలోని తుమ్మల క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన నూతన చైర్మన్ కొత్వాల ను తుమ్మల అభినందించారు. బొకే, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, దారా చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.