గజ్వేల్ నూతన ట్రాఫిక్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్ ) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరిపాక మురళి.

గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కలసి నూతన భాద్యతలు చేపట్టిన ట్రాఫిక్ సిఐ కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలుతెలియజేశారు.

అనంతరం ట్రాఫిక్ సిబ్బంది తో మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం మరియు చట్ట ప్రకారం నేరం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, సూచించారు.