జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు.

ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో కొనసాగించారు. జనవరి 1, 1986నపోచమ్మ-వెంకటస్వామి గౌడ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన ఆయన 2014 బ్యాచ్ లో ఎస్ఐగా ఎంపికై హైద్రాబాద్ గ్రేహౌండ్స్ లో ఏడు సంవత్సరాలు పని చేశారు.

విధి నిర్వహణలో భాగంగా 2023లో రేగొండ సివిల్ సెకండ్ ఎస్ఐగా విధులను నిర్వహించిన ఆయన 2024 జనవరి 14న మొగుళ్ళపల్లి ఎస్ఐగా విధుల్లో చేరారు. తన అభివృద్ధికి తోడ్పడింది అమ్మ నాన్న లే అని ఆయన తలుచుకుంటున్నారు.

ఆయన మొగుళ్ళపల్లి మండలంలో విధుల్లో చేరినప్పటి నుంచి ప్రజాసేవకుఅంకితమయ్యారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ఆయన ముందుండి వ్యవహరిస్తున్నారు. దీంతో మండల ప్రజలు ఆయననుఅభినందిస్తున్నారు.