వాహనదారుల పెండింగ్ చలాన్ రాయితీ తేదీ ఈనెల 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో చివరి రోజు వరకు వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏసిపి యం. రమేష్ తెలియజేశారు.
15వ తేదీ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులను గుర్తించి మొత్తం డబ్బులు కట్టించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ…
గజ్వేల్ డివిజన్ పరిధిలో ఈ – చలాన్ పెండింగ్ వున్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీరాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ – చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.
ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలి.
ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు. లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చు. తేదీ: 15-02-2024 వరుకు ట్రాఫిక్ చాలన్ లకు రాయితీ వర్తిస్తుంది
ద్విచక్ర వాహనలకు 80% శాతం రాయితీ , ఆర్టీసీ బస్సులు ఆటోలకు, తోపుడు బండ్లపై 90% శాతం రాయితీ,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితీ.
చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి
echallan.tspolice.gov.inతెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ-చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 15-02-2024 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి,15 తారీకు తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ – చాలన్ పెండింగ్ వాహనదారులను గుర్తించి పెండింగ్ ఉన్న మొత్తం డబ్బులను కట్టించడం జరుగుతుందని ఏసిపి యం. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.