localnewsvibe

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్.

అనంతరం వారు మాట్లాడుతూ… ఆర్టీసీ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుంది.

ఇది నిరంతర ప్రక్రియ అందులో భాగంగా ఈరోజుకొంతమంది కానిస్టేబుల్ లకి నియామక పత్రాలు ఇచ్చారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కరోనా , సమ్మె కారణంగా ఆర్టీసీ కి పలు సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నిటిని అదిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది.

నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 14.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్ లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుండి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు, నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ సహకారంతో ఏండి మార్గదర్శకంలో ముందుకు పోతున్నాం. ప్రజలంతా సహకరించాలి. దేశ వ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగ పడుతుందో పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు గమ్యానికి చేర్చే వ్యవస్థ రాష్ట్ర రవాణా లో ఆర్టీసీ పాత్ర కీలకమైంది.

ఆర్టీసి మనందరిది దానిని మనం కాపాడుకోవాలి. ఆర్టీసీ ని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నము చేస్తున్నామని తెలిపారు.