localnewsvibe

హుస్నాబాద్ నియోజకవర్గం ఫిబ్రవరి 07,2024

ఘనంగా మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు.

కోహెడ మండలం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ప్రైవేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ లు పంపిణీ చేశారు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ…
త్యాగాల తల్లి మాతా రామా భాయి కోట్లాది ప్రజల హక్కులు కోసం అంబేద్కర్ చేసిన పోరాటాలకి ఏ మాత్రం ఆటంకం కలిగించ కుండా పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించి, అన్ని విధాలా అంబేద్కర్ కి అండగా ఉండి ఎంతో కఠినమైన పేదరికాన్ని అనుభవించి తన బిడ్డల అనారోగ్యానికి మందులు కొనటానికి డబ్బులు లేక వైద్యం ఇప్పించలేక తన ముగ్గురు కొడుకులను కన్నా ఒక్క కుమార్తెను కోల్పోయి తను కూడా అనారోగ్యంతో వైద్యానికి డబ్బులు లేక చనిపోతూచావులు నాకు కొత్త కాదు ఇప్పటికే ముగ్గురు కొడుకులను ఒక కుమార్తెను కోల్పోయాను. నా ఆరోగ్యం కూడా క్షీణించింది కనీసం మిగిలిన ఒక్క కుమారుడనైన మంచిగా చూడు అని తన భర్త అంబేద్కర్ కి లేఖ వ్రాసి ప్రాణాలు విడిచిన త్యాగాల తల్లి మాత బాయీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సుతారీ కనుకయ్య, కాంటాస్టేడ్ ఎమ్మెల్యే మరాఠీ మణిదీప్, కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు పద్మారెడ్డి, గంగాధర్ రమేష్, తిరుపతి, బుమయ్య, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.