localnewsvibe

హైదరాబాద్ ఫిబ్రవరి 07, 2024

GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.

GHMC అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వచ్చే సమ్మర్ లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య లేదు. త్రాగునీటి సమస్య లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసాము.

GHMC లో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసితో ముందుకు వెళ్ళబోతున్నం. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు ఉంటాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాము.

అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో మా ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విబేధాలు లేవు.అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని వెళ్తాము. హైదరాబాద్ అభివృద్ధి పై రోజూ వారీగా సమీక్షలు, సమస్యల పై రిపోర్ట్ తయారీ ఉంటుంది. GHMC పరిధిలో అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచన చేసాము.

అప్పులు – ఆస్తులు అంశాల పై ముఖ్యమంత్రి కి నివేదిక ఇవ్వనున్నాము. గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఉంటుంది. GHMC సమస్యల పై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించాము.

డబుల్ బెడ్ రూమ్ ల పై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుంది. GHMC త్రాగునీటి అంశంలో రాజకీయ అపోహలు మాత్రమే, ఎలాంటి సమస్యలు లేవు. వచ్చే సమ్మర్ లో సిటీలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాదు. అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా OSD ని నియమిస్తున్నం.