localnewsvibe

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ షీటీమ్ బృందం

సింగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గజ్వేల్ షీటీమ్ బృందం.

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి

చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు.

ప్రభుత్వ, ప్రైవేటుఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించిన వారే.

సిద్దిపేట జిల్లా, ములుగు ఫిబ్రవరి 07

సింగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గజ్వేల్ షీటీమ్ బృందం.

ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి యం. రమేష్ మాట్లాడుతూ…

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు.

విద్యార్థులు యొక్క గోల్ గురించి,అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, నెంబర్ కు సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, స్కూల్ హెడ్మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ రహీమ్,
అధ్యాపకులు, గజ్వేల్ షీటీమ్ సిబ్బంది శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి.
తదితరులు పాల్గొన్నారు.