వామపక్ష జాడ! కానరాదే ఏడ!!
టి.జి. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా,,చిర్ర రాజు గౌడ్

ప్రశ్నించే గొంతుక డాక్టర్ కందాల శోభారాణి ప్రధమ వర్ధంతి యాది సభలో టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టార్ అశోక్ బాబుతో కలిసి గురువారం విద్యారణ్యపురి కాలనీలో స్మరించుకుంటూ.. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కందాల శోభారాణి రచయిత్రిగా, మానవ హక్కుల గొంతుకగా, ప్రతినిత్యం ప్రజల సమస్యలపై పోరాట ప్రటిమ, స్రీ సాహిత్య సేవకు ఎనలేని కృషి చేసినారని అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాలలో అధ్యాపకరాలుగా, కేయూ జ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్ గా సేవలు అందించడం జరిగిందిని టిజిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చిర్రా రాజు గౌడ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు శోభారాణి భర్త రమేష్, మానవ హక్కుల నాయకులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.