localnewsvibe

జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు – పోలీస్ కమిషనర్

పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు, నేరగాళ్లు, ఎవరు కూడా సిద్దిపేట జిల్లాలోకి రాలేదని సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మవద్దని, అయినప్పటికీ జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచిగస్తీనిర్వహిస్తున్నామని, పుకార్లను ఎవ్వరూ నమ్మరాదని పోలీస్ కమీషనర్ తెలిపారు.

ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు నిరంతరం కృషి చేస్తుందని, బయటకు కనిపించే విధులు గాకుండా ఆయా గ్రామాలు, పట్టణాలలోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై కూడా ప్రత్యేక పోలీసుల నిఘా ఉంటుందన్న విషయం ప్రజలు గమనించాలని సూచించారు. ఇంతవరకూ మన జిల్లాలో లేదా ఇతర జిల్లాల్లో ఇటువంటి ముఠాల గురించి సమాచారం లేనేలేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావాద్దన్నారు. ఎవ్వరూ చూడని విషయాలను ప్రచారం చేయడం సరి కాదని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100, లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం సమాచారం అందించాలని సూచించారు.