localnewsvibe

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు రూపొందించిందని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇంటింటికి ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.

గురువారం పాల్వంచ కూరగాయల మార్కెట్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కొత్వాల పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ జిందాబాద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి, పొంగులేటి, కొత్వాల నాయకత్వం వర్ధిల్లాయి అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే మహిళలకు ఉచిత రవాణా సావకార్యం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ సౌకర్యాలపై అధికారులు సర్వే చేపడుతున్నారన్నారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం అమలుకు ప్రణాళికలు చేపట్టనున్నారన్నారు. పేదవారి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. మిగిలిన పధకాలను కూడా 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో LDM కో-ఆర్డినేటర్ బద్ది కిషోర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, చాంద్ పాషా, భట్టు మురళి, H మధు, భూక్యా గిరి ప్రసాద్, రేగళ్ల శ్రీను, పాబోలు నాగేశ్వరరావు, సూర్య కిరణ్, పైడిపల్లి మహేష్, శాంతి వర్ధన్, పులి సత్యనారాయణ, దారా చిరంజీవి, కోండం పుల్లయ్య, గంధం నర్సింహారావు, వజ్జల రాము, వీరు, కూరగాయల మార్కెట్ సభ్యులు సత్యనారాయణ, చంద్రశేఖర్, శివ, కృషవేణి, చారి, నరేష్, తాళ్లూరి సత్యనారాయణ, వానపాకుల రాంబాబు, కట్టా సోమయ్య, రాంబాబు, కొండలరావు, నవభారత్ రాము, బాలు తదితరులు పాల్గొన్నారు.