భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్ గారి పిలుపుమేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కమలాపురం గ్రామం నందుగావ్ చలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో ఏ విధంగా లబ్ధి పొందాలో వివరిస్తూ రాబోవు పార్లమెంటు ఎన్నికలలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలనిస్థానిక కమలాపురం ప్రజలకు వివరించడం జరిగింది.


అదేవిధంగా ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగి లబ్ధి పొందాలని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మణుగూరు పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్ మరియుvకిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మునిగల శ్రీనివాస్ మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది