నకిరేకల్ (కట్టంగూర్), ఫిబ్రవరి 09,2024

టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు.

ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ…

తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా ఇంచార్జీ గా నియమించినందుకు ఫౌండర్ ప్రెసిడెంట్ యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. దళిత సంఘాల, దళిత్ జాతి కోసం తన వంతు సేవ చేస్తానని అన్నారు.