నకిరేకల్ నియోజకవర్గం
కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు.
6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380 మంది బాలబాలికలకు దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. అందులో సుమారు 140 మంది విద్యార్థులకు దంత సమస్యలను గుర్తించారు.
వారికి వచ్చేవారం కామినేని దంత వైద్య కళాశాలలో దంత చికిత్సలు చేస్తామని వైద్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ అంబటి అంజయ్య, దంతవైద్యులు పాల్గొన్నారు.