CPM రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రముఖ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యను ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు.

శుక్రవారం పాత పాల్వంచలో కొత్వాల స్వగృహానికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భంగా కాసానిని ఆహ్వానించి శాలువాతో ఆయనను కొత్వాల సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, CPM నాయకులు అన్నవరపు సత్యనారాయణ, CPM కొత్తగూడెం పట్టణ నాయకులు జునుమాల నగేష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, తదితరులు పాల్గొన్నారు.