గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ల స్థానంలో నియమితులైన ప్రత్యేకాధికారులు ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాల్వంచ మండల 19 వ సర్వసభ్య సమావేశం శుక్రవారం MDO కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ… పంచాయతీ పాలకవర్గాలు వున్నప్పుడు ప్రజాసమస్యలపై పట్టు ఉండేదని, ఇప్పుడు వున్న ప్రత్యేకాధికారులు నిత్యం, సమస్యలపై అవగాహనా ఏర్పర్చుకోవాలన్నారు.
ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లోని గృహ దీపం పథకం లబ్ధిదారుల అర్హులపై సర్వే చేపట్టిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు లభిదారుల ఎంపికపై శ్రద్ధ కనబరిచి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని కొత్వాల కోరారు.
కొత్వాలను సన్మానించిన సర్వసభ్య సమావేశం
ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా DCMS చైర్మన్ గా ఎంపికైన కొత్వాల శ్రీనివాసరావు ను మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, MPTC లు, గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ లు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో MPP మడివి సరస్వతి అధ్యక్షత వహించగా MRO నాగరాజు, MPDO అప్పారావు, MPO నారాయణ, వైస్ MPP మార్గం గుర్వయ్య, ప్రత్యేకాధికారులు, MPTC లు తదితరులు పాల్గొన్నారు.