ఉత్తరప్రదేశ్ ఫిబ్రవరి10,2024

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించిన సందర్భంగా అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి అధ్యక్షుడు

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సందర్బంగా అయోధ్య బాల రాముడుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ప్రధాని నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపిన సామజిక కార్యకర్త, పివి సేవాసమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న ప్రకటించిన సందర్బంగా ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు శనివారం అయోధ్య లో కొలువుదీరిన బాల రాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ… 2004 పీవీ మరణాంతరం నుండి నేటి వరకు పివి జయంతి, వర్ధంతిని ఏంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పీవీ పేరుతో పండ్లు, బ్రేడ్ ,రక్తదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాలు రాయడం వంటి కార్యక్రమాలు చెయ్యడం జరిగిందని తెలిపారు.పీవికి భారతరత్న ఇవ్వాలనీ 2018 లో సైకిల్ యాత్ర మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చేతుల మీదుగా జెండా ఊపి ఉద్యమానికి నాంది పలకాలని దృడ సంకల్పంతో ముందుకు సాగాము వంగర నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి 2019 డిసెంబర్ 27న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి పీవీ కి భారతరత్న ఇవ్వాలనీ వినతిపత్రం సమర్పించామని అన్నారు. పీవీ శతజయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహించగా 2020 జూన్ 28న, పీవీ నరసింహారావు కాలనీ (కోహెడ మండలం, వెంకటేశ్వర్లపల్లి గ్రామం లో ), పీవీ మార్గ్ కోహెడ నుండి హుస్నాబాద్ రోడ్డు కీ నామకరణం చేస్తూ గ్రామంలో ప్రతి నెల పేదవారికి, శుభకర్యాలకు 50కిలోల బియ్యం పంపిణీ చేస్తూ పీవీ పై భక్తిని చాటుకునేవాడిని ,గత ఇరవై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ఫలించిన సంతోషంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నాయకత్వంలో అయోధ్య బాల రాముడిని దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని రాజు ఆనందం వ్యక్తం చేశారు.

పీవీ కి మరియు మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పీతామాహుడు ఏం ఏస్ స్వామినాథ్ లకు భారతరత్న ప్రకటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువత అధ్యక్షులు కోహెడ మండల అధ్యక్షులు కంది సత్యనారాయణ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కొత్త పల్లి అశోక్, ఆవుల సంపత్, నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, నీలం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.