సిద్దిపేట, 10పిబ్రవరి,2024
గత ప్రభుత్వ అనవాతీనే కోనసాగింపు ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, మెస్ ఛార్జీలు పై స్పష్టత కరువు – యూనివర్శీటీలు అభివృద్ధికి నిధులు శూన్యం. – ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.8% మాత్రమే కేటాయించింది అంటే విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 2,296 కోట్లు విద్యారంగానికి పెరిగినట్లు ఉన్నా మొత్తం బడ్జెట్ పోల్చినప్పుడు పెరిగింది, ఇది చాలా తక్కువ,
గత విద్యారంగ బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 1.31 % మాత్రమే పెంచారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య యే మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినా కేటాయించింది 500 కోట్ల రూపాయలు మాత్రమే, 500 కోట్లతో ఎలా వీటిని నిర్వహిస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు ,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే సిద్దిపేట జిల్లా లో గత ప్రభుత్వం మినీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేదు ? ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించారు.
రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ, అగ్రికల్చర్ యూనివర్శీటీ, వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు.,తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు?
- పాఠశాల విద్యారంగ లో ఖాళీలు భర్తీ ,మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు ,మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది.
గురుకులాలు నిర్మాణం కోసం 1546కోట్లు కూడా సరిపోవని 800 పైగా గురుకూలాలకు స్వంత భవనాలు లేవని, ఉన్న గురుకులాలు కూడా సరైన మౌళిక సదుపాయాలు లేవు.ఈబడ్జెట్లో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ 7200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి విడుదల కోసం నిధులు కేటాయించలేదు?
గురుకులాలు, కెజిబివిలు, సంక్షేమ వసతిగృహలకు గత సంవత్సరం నుండి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. వాటి నిధులు గురించి కూడా ప్రస్తావన లేదు. అందుకే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 7.8% నిధులు మాత్రమే కేటాయించారు. నిధులను పెంచి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థులను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ఐ తెలిపింది.ఈ కార్యాక్రమంలో SFI సిద్దిపేట జిల్లా కమిటీ
రెడ్డమైన అరవింద్
జిల్లా అధ్యక్షుడు
దాసరి ప్రశాంత్,
SFI జిల్లా కార్యదర్శి
(9652946701) పాల్గొన్నారు.