గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా రజియా, భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో వేరే ఆడవారిని తీసుకొని వచ్చి వ్యభిచారం చేయుచున్నదని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వెళ్లి దాడి చేసి నిందితుడు ముట్ట గణేష్ తండ్రి నర్సింలు, గ్రామం తునికి మండలం ములుగు అతనిని మరియు ఒక మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 500 రూపాయలు 16 కండోమ్స్, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వ్యభిచార గృహ నిర్వాహకురాలు, మరియు విటుడు, విటురాలను గజ్వేల్ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ…

సిద్దిపేట జిల్లాలో పట్టణాలలో గ్రామాలలో కానీ ఇతర ప్రదేశాలలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, జూదం, పేకాట, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారమున్న, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.