మొగుళ్లపల్లి
యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, డయల్ 100, బాల్య వివాహాలు, బాలకార్మికులు, సిసి కెమేరాలు, గుట్కా, గంజాయి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా యువకులు చెడు వ్యసనాల బారీన పడి వారి బాబీ భారత జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, 1930 సైబర్ టోల్ ఫ్రీ నంబర్ గురించి అవగాహన ఉండాలన్నారు.