శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న – మురళి గౌడ్

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న – మురళి గౌడ్ లు ఆదివారం తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి..స్వీట్లు తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నారగోని స్వప్న మురళి గౌడ్ లు మాట్లాడారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీలో క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరిస్తామని తెలిపారు.