గజ్వేల్

గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు తెలియపరచాలని నోటీస్ బోర్డ్ లో గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీస్ అధికారుల సిబ్బంది యొక్క సెల్ నెంబర్లు అతికించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు కూడా సమన్వయం పాటించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఏదైనా ట్రీట్మెంట్ విషయంలో సమస్య ఉంటే పోలీసులకు తెలియపరచాలని సూచించారు.