2024 – 2025 సంవత్సరానికి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనరంజకం అని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై కొత్వాల స్పందిస్తూ మొత్తం ప్రవేశపెట్టిన 2,73,891 కోట్లలో ఆరు గ్యారంటీల అమలు కోసం అత్యధికంగా 53,196 కోట్లు కేటాయించడం ఎన్నికల వాగ్దానాల అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధి తెలియజేస్తున్నదన్నారు. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించి రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి గల శ్రద్ధను తెలియజేస్తున్నదని కొత్వాల అన్నారు.

SC, ST, BC, మైనారిటీ ల సంక్షేమం కోసం, పంచాయతి రాజ్ శాఖకు, పురపాలక శాఖకు అధిక నిధులు కేటాయించడం హర్షించదగిన విషయం అని కొత్వాల అన్నారు.